Thursday, September 19, 2024
Homeసినిమా‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసిన సుహాస్‌

‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ కుటుంబాన్ని ప‌రిచ‌యం చేసిన సుహాస్‌

‘క‌ల‌ర్‌ఫోటో’ తో హీరోగా తొలి స‌క్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో  ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో `రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మిన‌హా ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది. కొత్త ఏడాది సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టిన‌రోజు సంర‌ద్భంగా `రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌` ఫ్యామిలీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. సుహాస్ తండ్రి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఆశిష్ విద్యార్థి, త‌ల్లి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టి రోహిణి నటిస్తున్నారు. ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇందులో అంద‌రూ సెల‌బ్రేష‌న్స్ మూడ్‌లో క‌నిపిస్తున్నారు.

ష్మ‌ణుఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు ప‌డే రైట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మ‌నోహర్ గోవింద స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్ ప‌తాకాల‌పై అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్రాఫ‌ర్‌. అక్టోబ‌ర్‌లో సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. సుహాస్‌, ఆశిష్ విద్యార్థి, రోహిణి త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌: మ‌నోహ‌ర్ గోవింద‌స్వామి, బ్యాన‌ర్స్‌: చాయ్ బిస్క‌ట్ ఫిల్మ్స్‌, ల‌హ‌రి ఫిల్మ్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సూర్య చౌద‌రి, సంగీతం: శేఖర్ చంద్ర‌, సినిమాటోగ్ర‌పీ: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి, ఎడిట‌ర్‌: రామకృష్ణ అర్ర‌మ్‌, ఆర్ట్‌: ఎల్ల‌య్య‌.ఎస్‌, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌, నిర్మాత‌లు: అనురాగ్‌, శ‌ర‌త్‌, చంద్రు మ‌నోహ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: షణ్ముఖ ప్ర‌శాంత్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్