Sunday, January 19, 2025
HomeTrending NewsYSRTP: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

YSRTP: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోరాటానికి విపక్షాలు ఏకం అవుతున్నాయి. అన్ని పార్టీలు ఏక తాటి మీదకు వస్తేనే కెసిఆర్ ను ఎదుర్కోవటం సాధ్యమని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా వై ఎస్ ఆర్ టి పి అధ్యక్షురాలు వైస్ షర్మిల..తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లకు ఫోన్ చేసారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరిన షర్మిల.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని, కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల అన్నారు. ఇక షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు.

అటు రేవంత్ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. షర్మిల మార్చి 31న టీఎస్ పీఎస్ సీ ముట్టడికి బయల్దేరగా ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై షర్మిల స్పందించారు. పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమన్నా క్రిమినల్‌నా? అంటూ షర్మిల ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్