Monday, April 21, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు: మంత్రి సురేష్‌

షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు: మంత్రి సురేష్‌

జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్