Thursday, March 13, 2025
HomeTrending NewsGrain: తెలంగాణలో చురుగ్గా ధాన్యం సేకరణ

Grain: తెలంగాణలో చురుగ్గా ధాన్యం సేకరణ

రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో ఏక మొత్తంలో 1180 కోట్లను ఈ ఒక్క రోజే రైతుల అకౌంట్లో జమ చేశామన్నారు.7030 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంలో ఎప్పటికప్పుడు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తూ వాటికి అనుగుణంగా రైతుల ఖాతాలకు నిధులను నేరుగా బదిలీ చేస్తున్నామన్నారు, సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతతో నిధుల్ని సమకూర్చుతుండడంతో వెంట వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి గంగుల కమలాకర్ నేడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్