బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 13వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు దేవరుప్పల బీజేపీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో బండి సంజయ్ పాదయాత్రకు యువకులు నీరాజనం పలికారు. గ్రామంలోని ఆడపడుచులు బండి సంజయ్ కి హారతి పట్టి స్వాగతం చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించిగా… దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ ని నిలదీశారు . ఈ క్రమంలో బీజేపీ నాయకులపైకి టీఆర్ఎస్ నాయకులు రాళ్ళ దాడి చేశారు.
వాగ్వాదానికి దిగిన టీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలోనే పోలీసు అధికారులు ఏం చేస్తున్నరంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు తమ పాదయాత్ర తెలుసు కదా… పోలీసులు ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టారు. కాగా దేవరుప్పుల నుండి, దేవరుప్పుల తండా, ధర్మపురం మీదుగా మైలారం శివారు వరకు నేడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.
Also Read : సిఎం ఫాంహౌజ్ నీళ్లకు కోట్ల ఖర్చు -బండి సంజయ్