Sunday, January 19, 2025
HomeTrending Newsఆక్రమిత కశ్మీర్ కలుపుకునేందుకు పాక్ కుయుక్తులు

ఆక్రమిత కశ్మీర్ కలుపుకునేందుకు పాక్ కుయుక్తులు

భారత్ లోని కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పాక్ పునరాలోచనలో పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏనాటికైనా భారత్ కే చెందుతుందని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ తో ఇబ్బందులు వస్తాయని పూర్తిగా కలిపేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆక్రమిత కశ్మీర్ ప్రాంత స్వతంత్ర ప్రతిపత్తి హోదా తగ్గించేందుకు 15వ రాజ్యంగ సవరణ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఇస్లామాబాద్ నిర్ణయానికి వ్యతిరేకంగా POK ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మొత్తం 10 జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. సుమారు వెయ్యి మందిని పాక్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.

15th Constitutional Amendment

POKని పాకిస్తాన్… ‘ఆజాద్ కాశ్మీర్’ అని పిలుస్తుంది. స్వంత ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, అధికారిక జెండా కలిగిన స్వయం-పరిపాలన రాష్ట్రం. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ కశ్మీర్ అఫైర్స్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి నేతృత్వంలోని కశ్మీర్ కౌన్సిల్ తో ఎన్నుకోబడిన సంస్థ ద్వారా పరిపాలిస్తుంది. జూన్ 2018లో పాక్ రాజ్యాంగంలోని 13వ సవరణ… అసెంబ్లీకి చట్టాలను రూపొందించడానికి, కార్పొరేట్ పన్ను కాకుండా ఇతర పన్నులను వసూలు చేయడానికి అధికారం ఇచ్చింది. ఇస్లామాబాద్ ప్రమేయం లేకుండా ప్రధాన రాజకీయ, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అధికారం స్థానిక చట్టసభలకు ఉంది. అయితే, ఆ సమయంలో కూడా POKలో ఉన్నత న్యాయస్థానం… న్యాయమూర్తులను ఎన్నుకునే అధికారం, దాని ప్రధాన ఎన్నికల కమిషనర్, అత్యవసర నిబంధనలు పాకిస్తాన్ ప్రధానమంత్రి వద్దే ఉండిపోయాయి. ఇప్పుడు 15వ సవరణ ఆమోదం పొందినట్లయితే, కొత్త ముసాయిదా ప్రకారం, 13వ సవరణ కింద ఉన్న అన్ని అధికారాలు పిఓకే ప్రభుత్వం కోల్పోతుంది.

జూలై 1న ఇస్లామాబాద్‌లోని  కశ్మీర్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి… POK ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ పంపారు. అందులో POK తాత్కాలిక రాజ్యాంగానికి సవరణ కోసం పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారని తెలియజేసారు. ఆరుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు…POK ప్రభుత్వం చర్చలలో పాల్గొనడానికి దాని సభ్యులలో ముగ్గురుని నామినేట్ చేయాలని లేఖలో కోరారు.

కాశ్మీర్ లో ఇప్పటికే అటవీ సంపద కొల్లగొట్టిన పాకిస్తాన్ ప్రభుత్వం అనేక గనుల్ని మైనింగ్ కోసం చైనాకు కట్టపెట్టింది. వీటిల్లో వచ్చే ఆదాయం కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయటం లేదు. ఇప్పుడు 15వ రాజ్యాంగ సవరణతో పాటు టూరిజం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇవే జరిగితే కశ్మీర్ పాక్ లో మరో కొత్త రాష్ట్రంగా ఉండాల్సి వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్