Monday, June 8, 2026
HomeTrending Newsదేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోన కేసులు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3వేల 303 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క ఢిల్లీలోనే 13 వందల కేసులొచ్చాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, హరియాణా, మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయా రాష్ట్రాలు హెచ్చరిస్తున్నారు. ఇక కొవిడ్ మహమ్మారి నుంచి మరో 2వేల 563 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16వేల 980 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.74 శాతానికి తగ్గింది. నిన్న 39 మరణాలు సంభవించాయి. వాటిలో ఒక్క కేరళలోనే 39 మరణాలు చోటుచేసుకున్నాయి.

ఢిల్లీలో 1367 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 186 కేసులు వెలుగు చూశాయి. కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని నిర్లక్ష్యం చేయొద్దని, అందరు అప్రమత్తంగా ఉండి  టీకాలు వేసుకోవాలని టాటా ఇన్స్టిట్యూట్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సూచించారు. బూస్టర్ డోస్ వేసుకునేవారు అయిదు నుంచి తొమ్మిది నెలల విరామం ఇచ్చి టీకా వేసుకోవాలని స్పష్టం చేశారు.

Also Read : వేగంగా వ్యాపిస్తున్న కరోనా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular