Saturday, January 18, 2025
Homeసినిమారేపే '18 పేజెస్' ట్రైలర్

రేపే ’18 పేజెస్’ ట్రైలర్

ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్మ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ’18 పేజిస్’. నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే ‘కార్తికేయ’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సిద్దార్థ్ -అనుపమ జంటగా నటిస్తున్న ఈ  చిత్రానికి సుకుమార్ కథను అందించడం విశేషం. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి దీన్ని రూపొందించారు.

18పేజిస్‘ టీజర్ కి, ‘నన్నయ్య రాసిన’, ‘టైం ఇవ్వు పిల్ల’  అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన  ‘ఏడు రంగుల వాన’ పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది.  ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను 17 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగా ఒక క్రేజి వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు హీరో హీరోయిన్లు అనుపమ & నిఖిల్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్