Friday, November 22, 2024
HomeTrending Newsరెండో దశ లోక్ సభ ఎన్నికల బరిలో అగ్రనేతలు

రెండో దశ లోక్ సభ ఎన్నికల బరిలో అగ్రనేతలు

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో దశలో 13 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.  89 నియోజకవర్గాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాహుల్ గాంధి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల, మాజీ సిఎంలు భుపేష్ భాగెల్, కుమార స్వామీ తదితరులు పోటీ పడుతున్నారు.

ఇటీవల ఎదురుకాల్పులతో దద్దరిల్లిన కంకేర్ కు కూడా శుక్రవారం ఎన్నిక జరగనుంది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

1. అస్సాం (5): కరీంగంజ్, సిల్చార్, మంగళ్దోయ్, నవ్‌గాంగ్, కలియాబోర్

2. బీహార్ (5): కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా

3. ఛత్తీస్‌గఢ్ (3): రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కంకేర్

4. జమ్మూ మరియు కాశ్మీర్ (1): జమ్మూ

5. కర్ణాటక (14): ఉడిపి చికమగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్
6. కేరళ (20): కాసరగోడ్, కన్నూర్, వడకర, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, పొన్నాని, పాలక్కాడ్, అలత్తూర్, త్రిస్సూర్, చాలకుడి, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజా, మావెలిక్కర, పతనంతిట్ట, కొల్లం, అట్టింగల్, తిరువనంతపురం

7. మధ్యప్రదేశ్ (7): తికమ్‌ఘర్, దామోహ్, ఖజురహో, సత్నా, రేవా, హోషంగాబాద్, బేతుల్

8. మహారాష్ట్ర (8): బుల్దానా, అకోలా, అమరావతి (SC), వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని

9. మణిపూర్ (1): ఔటర్ మణిపూర్

10. రాజస్థాన్ (13): టోంక్-సవాయి మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, బార్మర్, జలోర్, ఉదయపూర్, బన్స్వారా, చిత్తోర్‌గఢ్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట, ఝలావర్-బరన్

11. త్రిపుర (1): త్రిపుర తూర్పు

12. ఉత్తరప్రదేశ్ (8): అమ్రోహా, మీరట్, బాగ్‌పట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ నగర్, అలీఘర్, మధుర, బులంద్‌షహర్

13. పశ్చిమ బెంగాల్ (3): డార్జిలింగ్, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్

రెండో దశలోని వివిధ నియోజకవర్గాల్లో అగ్రనేతలు బరిలో ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి హేమ మాలిని (మధుర), బీజేపీ టికెట్‌పై మూడోసారి పోటీ చేయగా, రామాయణం సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్ (మీరట్), కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (వయనాడ్) పోటీలో ఉన్నారు. CPI నుంచి అన్నీ రాజా,BJP కేరళ అధ్యక్షుడు K సురేంద్రన్ లు వయనాడ్ నుంచే అదృష్టం పరీక్షించుకుంటున్నారు, తిరువనంతపురంలో శశి థరూర్ vs కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా – కోటా, భూపేష్ భగల్ (రాజనందగావ్),డీకే సురేష్ (బెంగళూరు గ్రామీణం), శోభ కరంద్లాజే (బెంగళూరు ఉత్తరం), తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణం), హెచ్‌డీ కుమారస్వామి -మండ్య నుంచి పోటీ చేస్తున్నారు.

తొలి విడతలో 21 రాష్ర్టాల్లోని 102 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. ఏడో దశ జూన్ 1 తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్