Saturday, June 13, 2026
Homeసినిమా‘మేజర్’ నుండి 'ఓహ్ ఇషా' వీడియో సాంగ్ విడుదల

‘మేజర్’ నుండి ‘ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ విడుదల

Oh Isha: 2nd తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు.

మ్యూజికల్ ప్రమోహన్స్ లో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఒక గెట్ టుగెదర్ లో ఆర్మీ అధికారులు తమ లైఫ్ పార్ట్నర్స్ తో డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్ గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైయింది. కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వం ఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90’లో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్ ని ఈ పాటలో అందంగా చూపించారు.

ఈ లవ్లీ మోలోడీకి రాజీవ్ భరద్వాజ్ అందించిన సాహిత్యం కూడా అంతే హాయిగా అనిపించింది. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద పాటని మరింత శ్రావ్యంగా ఆలపించారు. లవ్లీ మెలోడీగా వచ్చిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

Also Read : ‘మేజర్’ గ్రేట్ మూవీ అవుతుంది – మ‌హేష్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular