Friday, April 19, 2024
HomeTrending Newsతుప్పు పట్టిన జాకీని లేపలేరు: కారుమూరి

తుప్పు పట్టిన జాకీని లేపలేరు: కారుమూరి

Don’t blame: రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా అక్కడి సిబ్బందే రైతులను దళారీల వద్దకు పంపుతున్నారంటూ వచ్చిన వార్తలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు  తీవ్రంగా ఖండించారు.  ధాన్యం సేకరణపై ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించే, ప్రసారం చేసే మీడియాపై పరువునష్టం  దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. సచివాలయంలో అధికారులతో కలిసి కారుమూరి మీడియాతో మాట్లాడారు. ఈ వార్త లో ప్రస్తావిచిన వ్యక్తి అసలు రైతే కాదని, రైతు కూలీ అని చెప్పారు.  స్వయంగా అతను చెప్పిన వీడియోను మంత్రి ఈ సందర్భంగా మీడియాకు ప్రదర్శించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద పనిచేస్తున్న హమాలీలకు కూడా డబ్బులు చెల్లించలేదని చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని, వారి అకౌంట్లలో డబ్బులు వేశామని  స్పష్టం చేస్తూ… చెక్కు నకలు కాపీని కూడా మంత్రి చూపించారు.

ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని, పనిగట్టుకొని  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.  ఒక కుటుంబంలో వ్యవసాయం చేసే కొడుకు చనిపోతే అతని తల్లి  ఆర్బీకేల గురించి తెలియక  దాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్దకు పంపారని, దానిపై కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్న మిల్లర్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, ఆర్బీకేల రైతులకు అండగా ఉంటూ, రైతుకు- రైస్ మిల్లర్ కు సంబంధం లేకుండా చూస్తున్నామని.. అన్నీసక్రమంగా జరుగుతున్నాయని వివరించారు. పొలాల్లో కూలీ పనులు చేసుకునే వారి వద్దకు మైకులు తీసుకెళ్ళి వారిచేత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసే కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి విమర్శించారు.  తుప్పు పట్టిపోయిన పార్టీని ఎంత జాకీలు వేసి లేపినా అది జారిపోతుంది కానీ, పైకి లేచే పరిస్థితి ఉండదని టిడిపిని ఉద్దేశించి  కారుమూరి వ్యాఖ్యానించారు.  మీడియాలో వచ్చిన వార్తను చూస్తే తమ పార్టీపై విషప్రచారం చేసి, తెలుగుదేశం పార్టీని పైకి లేపదానికే ఇలాంటివి ప్రచురిస్తున్నారని అయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

Also Read : రైతు భరోసాకు 7వేల కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్