Sunday, January 19, 2025
Homeసినిమా‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ రెడీ

‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ రెడీ

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో  తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్, డ్రామా, వినోదం.. ఫ్యామిలీస్ ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. ఈ నెల 15న ఈ మూవీ నుంచి ‘సుగుణ సుందరి’ అనే రెండో సింగిల్‌ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో బాలకృష్ణ బ్లాక్ కాస్ట్యూమ్‌ లో స్టైలిష్ లుక్‌ లో అదరగొట్టగా, శృతి హాసన్ స్టన్నర్‌ గా ఉంది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12 న సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read : బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ పూర్తి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్