ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులే ఏకైక మార్గమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి ఇతర ప్రయోజనాలు రావాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులుంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు.. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందన్నారు.