Sunday, January 19, 2025
HomeసినిమాSalaar Release New Dates: 'సలార్' కోసం 3 నెలల్లో 3 డేట్ లు ఫిక్స్...

Salaar Release New Dates: ‘సలార్’ కోసం 3 నెలల్లో 3 డేట్ లు ఫిక్స్ చేశారా..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే.. సెప్టెంబర్ 28న సలార్ సినిమా థియేటర్లోకి వస్తుంది అనుకుంటే.. ఊహించని విధంగా వాయిదా పడింది. ఇది అభిమానులకే కాదు.. ఇండస్ట్రీల జనాలకు కూడా పెద్ద షాకే. ఎందుకంటే.. సలార్ వాయిదా పడడంతో మిగిలిన సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి.. సలార్ వచ్చేది ఎప్పుడు అంటే క్లారిటీ లేదు. నిన్న సలార్ మేకర్స్ ఈ సినిమా వాయిదా పడిందని అఫిసియల్ గా అనౌన్స్ చేశారు కానీ.. న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

దీంతో సలార్.. న్యూ రిలీజ్ డేట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. 3 నెలల్లో 3 డేట్ లు గురించి ఆలోచిస్తున్నారట మేకర్స్. ఇంతకీ ఆ ముడు రిలీజ్ డేట్ లు ఏంటంటే.. నవంబర్ 10న సలార్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఒకవేళ నవంబర్ లో కుదరకపోతే.. డిసెంబర్ 20న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. డిసెంబర్ లో కూడా సెట్ కాకపోతే.. జనవరి 12న విడుదల చేయలనేది ప్లాన్ అని వార్తలు వస్తున్నాయి. ఇలా సలార్ రిలీజ్ కోసం.. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలల్లో మూడు డేట్ లు పరిశీలిస్తున్నారట. మరి.. ఏ డేట్ ఫైనల్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్