Tuesday, September 17, 2024
HomeTrending News8వ తేదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

8వ తేదిన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కూటమి సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్రమోడి సిద్దం అయ్యారు. ఈ నెల 8వ తేదినప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్రపతిని కలిసి రాజీనామా సమర్పించగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణస్వీకార మహోత్సవం ఉండనున్నట్లు పేర్కొన్నాయి. ఇవాళ సాయంత్రం ఎన్డీఏ కూటమి సమావేశం అనంతరం నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిసింది.

ఇవాళ ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులతో మోడీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి వర్గం రద్దు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇక ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పనున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన రెండో నేతగా రికార్డు సృష్టించనున్నారు.

ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. బిజెపికి 240 సీట్లు రాగా కాంగ్రెస్ కు 99 సీట్లు వచ్చాయి. దీంతో అతిపెద్ద పార్టీగా ఉన్న బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అయింది. బిజెపికి మరో 32 సీట్లు అవసరం ఉన్న్నాయి. JD(U), టిడిపిలు కూటమిలోని పార్టీలు కావటంతో ఎన్డీయే అధికారంలోకి రావటం ఖాయమైంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్