Wednesday, May 7, 2025
HomeTrending Newsపోలీసుల తనిఖీల్లో పట్టబడిన 4 కోట్లు

పోలీసుల తనిఖీల్లో పట్టబడిన 4 కోట్లు

హైద్రాబాద్ – విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్, రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు దొరికి పోయాడు. కారును తనిఖీ చేస్తే .. అందులో 4 కోట్ల రూపాయల హవాలా డబ్బు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారులో హైదరాబాద్ నుంచి చెన్నై కి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాగా, పట్టుబడ్డ డబ్బు ఏ.బి.ఫార్మా కంపెనీకి చెందినట్లుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్