Sunday, January 19, 2025
HomeTrending Newsహైదరాబాద్ ఆధునిక నగరం : ఆసియాన్ మీడియా

హైదరాబాద్ ఆధునిక నగరం : ఆసియాన్ మీడియా

హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను తమ ఇండియా పర్యటన షెడ్యూల్ లో భాగం చేసుకోవాలని యువతకు సూచించనున్నట్లు పేర్కొన్నారు.
ఆసియాన్ -ఇండియా మీడియా ఎక్చేంజ్ లో భాగంగా మియన్మార్, కాంభోడియ, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, బ్రూనై , పిలిప్పీన్స్ , మలేసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం తెలంగాణలో ఈ నెల 12 నుంచి హైదరాబాద్ లోని పలు పారిశ్రామిక , చారిత్రక, వాణిజ్య ఆర్థిక సంస్థలను సందర్శించింది. ఆసియాన్ మీడియా పర్యటనను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయం చేసింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన పర్యాటక బస్ ద్వారా వాహన సదుపాయం కల్పించారు.
ఆసియన్ సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ ఆఫీసర్ Pattgiya Tengfueng ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనంతో ఆహ్లాదకరంగా వున్నదని పేర్కొన్నారు. ఈ రోజు (బుదవారం) 15 న శంషాబాద్ విమానాశ్రయం నుంచి సింగపూర్ ద్వారా ఆసియన్ మీడియా ప్రతినిధులు ఆయా దేశాలకు తిరిగి వెళ్లారు.

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆసియన్ మీడియా ప్రతినిధులను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు బి. రాజమౌళి సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వారికి వివరించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుటకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు బి. రాజమౌళి వివరించారు.

తమ పర్యటనలో భాగంగా Shamirpet లో జరిగిన 4 th ASEAN-India Youth Summit లో ఈ బృందం పాల్గొన్నది. సాలార్ జంగ్ మ్యూజియం ను సందర్శించినది. భారత దేశంలోని రాజులు వినియోగించిన ఆయుధాలను, అలంకరణ , మెడిసిన్, గృహ వినియోగ నగిషీ వస్తువులను , పెయింటింగ్స్, శిల్పాలను వారు పరిశీలించినారు. ఆనాటి చారిత్రక జ్ఞాపకాలను పదిలపర్చుటకు సాలార్ జంగ్ చూపిన చొరవను వారు ప్రశంసించారు. కొంతమంది చార్మినార్ ను సందర్శించారు.

భారత్ బయోటెక్ ను ఆసియన్ మీడియా సందర్శించినది .ఫార్మా రంగంలో హైదరాబాద్ సాధించిన ప్రగతిని, వ్యాధుల నియంత్రణకు తయారు చేస్తున్న వాక్సిన్ల గురించి తెలుసుకున్నారు. ప్రపంచ ఫార్మా కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందినట్లు అధికారులు వారికి వివరించారు. National Payments Corporation of India , శిల్పారామంను ఆసియన్ మీడియా సందర్శించి , పర్యటన గుర్తుగా కొన్ని వస్త్రాలను, అలంకరణ వస్తువులను మీడియా ప్రతినిధులు కొనుగోలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్