Sunday, January 19, 2025
Homeసినిమాపద్మాలయా సంస్థకూ యాభై ఏళ్ళు

పద్మాలయా సంస్థకూ యాభై ఏళ్ళు

పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆగస్ట్ 27 1971 న విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో మోత మోగించింది. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేరు. కానీ ఆ రోజుల్లోనే సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా సినిమా తీసి చూపించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ 56 దేశాలలో ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది. తమిళ్ లో ‘మోసక్కారన్ కు మోసక్కారన్’, ఇంగ్లీష్ లో ‘ట్రెజర్ హంట్’ పేరుతో డబ్ చేశారు.

రిపీట్ రన్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడిందని ఇటీవల కృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. వి ఎస్ ఆర్ స్వామి ఫోటోగ్రఫీ.. మాధవరావు మేకప్ పనితనం.. ఆదినారాయణరావు సంగీతం.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పచ్చు. సూపర్ హిట్ పాటలు.. నేపధ్య సంగీతం.. ప్రేక్షకులకు, సూపర్ స్టార్ అభిమానులకు ఓ కొత్త అనుభూతిని అందించాయి. హీరోయిన్ విజయనిర్మలతో కృష్ణ.. ‘కొరినది నెరవేరింది…’ పాట చిత్రీకరణ కోసం డార్జిలింగ్ వెళ్ళడం విశేషం. ఈరోజుతో పద్మాలయా సంస్థ కూడా 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం.

కృష్ణ సాహసోపేత నిర్ణయాలకు వారి సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరి రావు తోడ్పాటు, సహకారం అందించి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. అమితాబచ్చన్, రజనీకాంత్ లాంటి అగ్రనటులతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పద్మాలయా. వరుసగా ‘పాతాళ బైరవి’, ‘మవ్వాలి’, ‘హిమ్మత్ వాలా’ …ఇలా.. 3 సిల్వర్ జూబ్లీ లు నిర్మిచిన ఏకైక దక్షిణ భారత నిర్మాణ సంస్థ పద్మాలయా. దర్శకులు కె రాఘవేంద్రరావు, ఇ.వి.వి సత్యనారాయణ; హీరోయిన్స్ శ్రీదేవి, సౌందర్యలను హిందీ చిత్రసీమకు పరిచయం చేసిన సంస్థ. 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంలో కృష్ణ, సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ… పద్మాలయా సంస్థ మళ్ళీ సినిమా నిర్మాణం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హనుమంతరావు కుమారులు ప్రసాద్ బాబు, నరసయ్య బాబు; ఆదిశేషగిరి రావు కుమారుడు రాఘవ రత్న బాబు సారథ్యం లో సంస్థ ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్