తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు విద్యా సంస్థలకు దసరా సెలవులుగా ప్రకటించింది. కాగా సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయి. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీ సోమవారం ప్రారంభం అవుతాయి. కాగా, అక్టోబర్ 5వ తేదీన దసరా పర్వదినంగా నిర్ణయిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది.