Saturday, November 23, 2024
Homeసినిమాఅటు ఎమోషన్ .. ఇటు అడ్వెంచర్ .. '65'

అటు ఎమోషన్ .. ఇటు అడ్వెంచర్ .. ’65’

టాలీవుడ్ లో నిన్న పెద్ద సినిమాలేవీ థియేటర్స్ లో లేవు. ఇప్పట్లో బరీలోకి దిగే భారీ సినిమాలు కూడా ఏమీ లేవు. ఇలాంటి ఒక సమయంలో ఒక భారీ హాలీవుడ్ సినిమా వస్తే, తప్పకుండా మంచి రెస్పాన్స్ ను రాబడుతుందని అనుకోవచ్చు. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాలీవుడ్ మూవీనే ‘65‘. ఈ సినిమా డైనోసర్స్ నేపథ్యంలో నడుస్తుంది గనుక, సహజంగానే కలిగే ఒక రకమైన కుతూహలం థియేటర్స్ వరకూ నడిపించుకుని వెళుతుంది.

అలా థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ ఎంతమాత్రం నిరాశ చెందకుండా ఉండే సినిమానే ’65’. ఈ కథ 65 మిలియన్ ఏళ్ల క్రితం జరిగినదిగా తెరపైకి వస్తుంది. వేరే గ్రహానికి చెందిన మానవులు తమ స్పేస్ షిప్ ను గ్రహశకలాలు ఢీ కొనడం వలన, భూమిపై క్రాష్ ల్యాండ్ కావల్సి వస్తుంది. ఆ స్పేస్ షిప్ లో పైలెట్ .. ఒక పదేళ్ల పాప తప్ప అంతా చనిపోతారు. ఒక మౌంట్ పై పడిపోయిన స్పేస్ షిప్ దగ్గరికి వెళ్లి, అక్కడి నుంచి తమ గ్రహానికి చేరుకోవాలనేది వారి ప్రయత్నం.

స్పేస్ లోని పైలెట్ కూతురు ఇంటి దగ్గర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అతను వెళ్లి ఆమెకి ట్రీట్మెంట్ చేయించాలి. అలాగే తనతో పాటు ప్రాణాలతో బయటపడిన అమ్మాయిని కూడా సేఫ్ గా తీసుకుని వెళ్లాలి. ఆ ఉద్దేశంతో డైనోసర్స్ ను ధైర్యంగా ఎదుర్కుంటూ అతను సాగించిన ప్రయాణమే ఈ సినిమా. కేవలం రెండు పాత్రలతో .. ఫారెస్టులో సాగే ఈ సినిమా తెరపై నుంచి దృష్టి మరల్చనివ్వదు. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఎమోషన్స్ .. అడ్వెంచర్ ను కనెక్ట్ చేసే ఈ కథ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ నచ్చుతుందని అనడంలో  సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్