ఇండోనేషియాలోని జావాలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. సెంట్రల్ జావాలోని ఓ రిజర్వాయర్ లో టూరిస్టులు షికారుకు బయల్దేరారు. పడవ కొంత దూరం వెళ్ళగానే సెల్ఫి తీసుకునేదుకు అందరూ ఒకేవైపుకు వెళ్ళినప్పుడు పడవ ఒరిగి ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిమితికి మించి మొత్తం 20 మంది పడవలో ఉన్నారని సెంట్రల్ జావాకు చెందిన పొలీస్ ఉన్నతాధికారి అహ్మద్ లుఫ్తి వెల్లడించారు. 11 మందిని రక్షించామని, మరో ఏడు మృతదేహాలు దొరికాయని చెప్పారు. మరో ఇద్దరి జాడ ఇప్పటివరకూ తెలియరాలేదని వివరించారు. సంబంధిత రిజర్వాయర్ లో బోటు నిర్వహిస్తున్న యాజమాన్యం తప్పు ఏ మేరకు ఉండనే విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జావా ప్రాంతంలో ఇలాంటి పడవ ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాల్లో రోజుల తరబడి గాలించినా అనేకమంది టూరిస్టులు, ప్రయాణికుల జాడ లభించడం లేదు.