అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అంథాలజీ `నవరస` విడుదలకు ముందు, కోలీవుడ్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్లోబెల్ మ్యూజికల్ ఫ్యాన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ అంథాలజీలోని 9 చిత్రాల్లోని ఎమోషన్స్ కలయికను తెలియజేసేలా, హృదయాన్ని స్పృశించేలా అందరూ ఇందులో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ అంథాలజీని వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం పెంచడానికి, నవరసలోని తొమ్మిది భావోద్వేగాల రుచిని తెలియజేయడానికి నెట్‌ఫ్లిక్స్, సంగీతం, భావోద్వేగాలు, ప్రతిభల కలయికగా అద్భుతమైన `సింఫనీ ఆఫ్ ఎమోషన్స్` అనే గ్లోబెల్ ఫ్యాన్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ వర్చువల్ కార్యక్రమంలో ఈ అంథాలజీ క్రియేటర్స్, నటీనటులు, దర్శకులు, మ్యూజిషియన్స్, వివిధ శాఖలకు చెందినవారందరూ భాగమయ్యారు. వీరందరూ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ సంభాషించుకున్నారు. `నవరస`పై తమకున్న ప్రేమను తెలియజేస్తూ 46 మంది సభ్యులు స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ “ఈ రోజు కార్యక్రమంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం ఇంత మంది టాలెంటెడ్ పర్సన్స్ కలిసి పనిచేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. `నవరస` సమర్ధవంతమైన వ్యక్తుల దగ్గర చేరినందుకు చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.
జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ “కోవిడ్ 19 సెకండ్ వేవ్ పరిస్థితుల్లో మా అంథాలజీ కోసం పనిచేసిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, వారి ఆత్మ, హృదయాలను ప్రాజెక్టుపై కేంద్రీకరించి పనిచేశారు. ఇంకా ఇండస్ట్రీలో ఎక్కువ మందికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాం. కాబట్టి పరిశ్రమలోని చాలా మంది వీటిల్లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాం. ఎక్కువ మందిని ఇలాంటి ప్రాజెక్టుల్లో భాగం చేయడమనే పదో రసాన్ని మనం కనిపెట్టాలని మణిరత్నం సూచించారు“ అన్నారు.
మనిషిలోని కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, నవ్వు, ప్రేమ, శాంతి, అద్భుతం వంటి తొమ్మిది రసాల ఆధారంగా రూపొందిన `నవరస`ను రూపొందించడానికి తమిళ చిత్ర పరిశ్రమలోని అద్భుతమైన క్రియేటర్స్ కలిసి ముందుకు వచ్చారు. భారతీయ చిత్ర పరిశ్రమంలో లార్జన్ దేన్ లైఫ్ అనే సంస్కృతికి ప్రాణం పోశారు. నెట్‌ఫ్లిక్స్ లో నిన్న (ఆగస్ట్ 6న) `నవరస` విడుదలైంది.