Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్టోక్యో ఒలింపిక్స్: లవ్లీనాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్: లవ్లీనాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా బాక్సర్ లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో  ప్రపంచ ఛాంపియన్, టర్కీ దేశానికి కు చెందిన బుసేనాజ్ సుమేనెలి చేతిలో పరాజయం పాలైంది. వరుసగా మూడు రౌండ్లనూ లవ్లీనా  కోల్పోయింది. ఒలింపిక్స్ లో మేరికోమ్, విజయేందర్ తరువాత బాక్సింగ్ లో మన దేశానికి పతకం సాధించిన క్రీడాకారిణిగా లవ్లీనా చరిత్ర సృష్టించింది.

69 కిలోల మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా థైపీకు చెందిన నీన్ చిన్ చెన్ పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్ లో ప్రవేశించింది. అంతకుముందు ఫ్రీ క్వార్టర్స్ రెండో రౌండ్ లో జర్మన్‌కి చెందిన నదైన్ అపెజ్‌ను 3-2 తేడాతో ఓడించిన లవ్‌లీనా క్వార్టర్ ఫైనల్ చేరింది.  ఇండియా కు చెందిన స్టార్ బాక్సర్ మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెల్చుకుంది.

పతకాల పట్టికలో ఇండియా ఇప్పటి వరకూ ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్