Sunday, November 24, 2024
HomeTrending NewsCM Jagan: బాలికా విద్యకు ప్రోత్సాహం: సిఎం

CM Jagan: బాలికా విద్యకు ప్రోత్సాహం: సిఎం

తమ  ప్రభుత్వ పథకాల ద్వారా ఆడపిల్లలు కనీసం డిగ్రీ వరకూ చదువుతున్నారని,  రాష్ట్రంలో దాదాపు 86% మంది ఆడపిల్లలు డిగ్రీ వరకూ చదువులు పూర్తి చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారని ఇది చాలా సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాము అనుకున్న లక్ష్య నేరవేరుతోందని అన్నారు.

వైఎస్సార్ కళ్యాణమస్తు,  వైఎస్సార్ షాదీ తోఫా  పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తోన్న ఆర్ధిక సాయాన్ని నేడు  ముఖ్యమంత్రి విడుదల చేశారు.  ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధికసాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ  సందర్భంగా సిఎం మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ఏ కుటుంబంలో అయితే ఇల్లాలు డిగ్రీ వరకూ చదువుకొని ఉంటుందో ఆ కుటుంబంలో మిగిలిన వారు కూడా ఉన్నత చదువులు అభ్యసించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పేదరికం నుంచి బైట పడాలంటే చదువు తప్పని సరి అనేది తమ అభిమతమని స్పష్టం చేశారు.  బాలికా విద్యను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి మండలంలో ఒక హై స్కూల్ ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా గ్రామ సచివాలయాల్లోనే ఇప్పించే ఏర్పాటు చేశామన్నారు.

ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యుత్, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున, మహిళా,శిశుసంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కె విజయ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్