Sunday, September 22, 2024
HomeTrending NewsChiru-YSRCP: కొందరు భుజాలు తడుముకుంటున్నారు: విజయసాయి ట్వీట్

Chiru-YSRCP: కొందరు భుజాలు తడుముకుంటున్నారు: విజయసాయి ట్వీట్

మెగా స్టార్ చిరంజీవిపై వైఎస్సార్సీపీ రాజకీయ దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయ సాయి రెడ్డి పరోక్షంగా ట్వీట్ లతో విమర్శలు గుప్పించారు.

మూడ్రోజుల క్రితం జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి  సినిమా బ్రో సినిమా వివాదంపై పరోక్షంగా మాట్లాడారు. పిచుక పై బ్రహ్మాస్త్రంలాగా సినిమా పరిశ్రమపై మీ ప్రతాపం ఏమిటని …రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని చురకలు అంటించారు. దీనిపై మంత్రులు, వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అయితే  తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు పేరిట ఓ ప్రకటన విడుదల అయింది. రాజ్యసభలో  సినిమాటోగ్రఫీ చట్టంపై మాట్లాడిన సందర్భంలో  విజయసాయి రెడ్డినటుల పారితోషికం గురించి మాట్లాడారు. దీన్ని ఉద్దేశించి మాత్రమే చిరంజీవి మాట్లాడారని అంటూ ఓ వీడియో ను కూడా వుడుదల చేశారు.

“సినిమా నటుల రెమ్యునరేషన్స్ గురించి ఢిల్లీ పెద్దలు రాజ్యసభలో మాట్లాడటం నాకు చాలా బాధ కలిగింది.. మేము నటించేది సినిమా ఇండస్ట్రీలో కార్మికులు ఆనందంగా జీవించడం కోసం.. ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది మా ఉద్దేశం.. నేను దేశ రాజకీయాలు చూశా, వాటి ముందు సినిమా రంగం చాలా చిన్నది.. మా నటన నచ్చితే అభినందించండి, కానీ రాజకీయాలతో ముడిపెట్టి చూడకండి..  అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి” అంటూ చిరంజీవి మాట్లాడారు.

దీనిపై నేడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ” సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.”

“కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ….లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్.”

“సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?” అంటూ మూడు వరుస ట్వీట్ లు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్