Monday, November 25, 2024
HomeTrending NewsCM Jagan: నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు

CM Jagan: నేడు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు

మహిళా సాధికారతకు ఊతమిస్తూ  వారు చేస్తున్న వ్యాపారాలకు  సున్నావడ్డీకే రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వైఎస్సార్ సున్నావడ్డీ పథకానికి నాలుగో ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగే కార్యక్రమంలో శ్రీకారం చుట్టనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.  1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ ఈ నిధులను వారి బ్యాంకు  ఖాతాల్లో నేడు  ముఖ్యమంత్రి బటన్ నొక్కి  జమ చేయనున్నారు.

బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారంపడకుండా, వారి తరపున ఆ వడ్డీ భారాన్ని “వైఎస్సార్ సున్నా వడ్డీ”క్రింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో  చేస్తోంది.  నేడు అందిస్తున్నరూ. 1,353.76 కోట్లతో కలిపి ఈ పథకం  ద్వారా  ఇప్పటి వరకు అందించిన మొత్తం సాయం రూ. 4,969.05 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.

అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా, వారి జీవనోపాధి మెరుగుపడేలా.. బహుళ జాతి, దిగ్గజ కంపెనీలు మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోందని ఓ ప్రకటన లో వెల్లడించారు.

ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంకులతో వడ్డీ రేట్లు తగ్గింపజేయడంతో అక్కచెల్లెమ్మలపై ఏకంగా రూ. 1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గిందని, ఏటా రూ. 30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకొని వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ రుణాల రికవరీలో సైతం 99.67% తో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆర్థిక పరిపుష్టిని సాధించారని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్