Friday, November 22, 2024
HomeTrending NewsHawaii: 57కు చేరిన హవాయి ద్వీపం మృతులు

Hawaii: 57కు చేరిన హవాయి ద్వీపం మృతులు

అమెరికాలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మావీయ్‌ ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వెయ్యికి పైగా ఇండ్లు దగ్ధమయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 53 మంది మరణించారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికి గాలులు తోడవడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల వల్ల గురువారం నాటికి 36 మంది మృతిచెందగా, తాజాగా మరో 17 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.

మంగళవారం రాత్రి నుంచి కార్చిచ్చు వ్యాపిస్తున్నట్లు మావీయ్‌ కౌంటీ వెల్లడించింది. కార్చిచ్చుకు తోడు హవాయి సమీపంలో గంటకు 82 మైళ్ల వేగంతో, మావీయ్‌లో గంటకు 62 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయని, చెట్లు, కార్లు, ఇతర వాహనాలు కాలి బూడిదైనట్లు చెప్పారు. అగ్నికీలలు చుట్టుముట్టిన పరిస్థితుల కారణంగా అధికారులు రోడ్లను మూసివేశారు. ఒక్క హైవే మాత్రమే అందుబాటులో ఉండగా.. ఆ మార్గం గుండా వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
అమెరికాలోని హ‌వాయి ద్వీపంలో వ‌చ్చిన కార్చిచ్చు రాత్రికి రాత్రే ల‌హైనా ప‌ట్ట‌ణాన్ని బుగ్గి చేసేసింది. దావాన‌లం ధాటికి ప‌ట్ట‌ణంలో ఉన్న బిల్డింగ్‌ల‌న్నీ కాలిపోయాయి. మ‌హా వృక్షాలు కూడా ద‌గ్ధం అయ్యాయి. అయితే ల‌హైనా కోర్ట్‌హౌజ్ ముందు నాటిని మ‌ర్రి చెట్టు మాత్రం స్వ‌ల్పంగా కాలిపోయింది. ఆ మ‌ర్రి చెట్టు ఊడ‌లు కొన్ని ఇంకా స‌జీవంగా ఉన్నాయి.

ఈ మ‌ర్రి వృక్షానికి పెద్ద స్టోరీ ఉంది. 1873లో ఇండియా నుంచి ఈ మ‌ర్రి వృక్షానికి చెందిన మొక్క‌ను తీసుకువెళ్లి అక్క‌డ నాటారు. 150 ఏళ్లుగా ఆ చెట్టు త‌న శాఖ‌ల‌ను విస్త‌రిస్తూ పోయింది. ల‌హైనా హార్బ‌ర్ స‌మీపంలో ఆ వృక్షం ఓ సుంద‌ర ప్ర‌దేశంగా మారింది. స్థానిక ప‌ర్యాట‌కుల్ని ఆ వృక్షం ఆక‌ర్షిస్తోంది. యావ‌త్ అమెరికాలోనే ఈ మ‌ర్రి వృక్షం పెద్ద‌ద‌న్న వాద‌న కూడా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్