అధికారంలోకి రాగానే కేజీ నుంచి పిజి విద్యనూ ప్రక్షాళన చేస్తామని, కరికులమ్ లో సమూల మార్పులు తీసుకు వస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ఉద్యోగ కల్పనకు అవసరమైన అంశాలను పొందుపరుస్తామని, దీనితో పాటు, సామాజిక, పౌర బాధ్యతను కూడా పాటించేలా చూస్తామని చెప్పారు. విద్య, హెల్త్ కేర్ రంగాలను మెరుగుపరుస్తామన్నారు. యువ గళం పాదయాత్రలో భాగంగా తాడికొండలో పర్యటిస్తున్న లోకేష్ ఆడిటర్లతో ముఖాముఖి నిర్వహించారు.
మార్గదర్శి సంస్థ 62 ఏళ్ళుగా నీతి నిజాయతీగా నడుస్తోందని, ఈనాడులో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, వారికి చెందిన చిట్ ఫండ్ ను, దానిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆడిటర్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ ఆరోపించారు. తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ పై కూడా ఇలాగే కక్ష సాధింపు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ హయంలో ఆడిటర్లపై కూడా దాడులు జరుగుతున్నాయని, రాజకీయ కోణంలో కొందరిని బాలి చేయాలనుకున్నప్పుడు వీరిని కూడా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు చెల్లించేవారు తాము కట్టే డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయని అడుగుతారని, ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించాడంలేదని అడుగుతున్నారని…. తన కుటుంబంలో తల్లి, బ్రాహ్మణి కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉంటారని లోకేష్ చెప్పారు. వ్యాపారస్తులు గతంలో చెల్లించాల్సిన పన్ను బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించేలా తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో కంపెనీలను ఇలాగే వేధిస్తే కొత్తగా పెట్టుబడులు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ ఏ వర్గాన్నీ వేధించాలనే ఆలోచన చేయబోమని, తము పది నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిలో మూడు సరిగా లేకపోవచ్చని, వాటిలో తప్పులను దిద్దుకుని సవరించుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అంతిమంగా ఇది మన రాష్ట్రమని, దీన్ని మనం బాబు చేసుకోక పొతే ఢిల్లీ వాళ్ళో, తెల్ల వాళ్ళో చేయరని లోకేష్ వ్యాఖ్యానించారు. తమ హయంలో ఎఫ్.డి.ఐ.లో, ఉపాధి కల్పనలో, ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలో మొదటి స్థానంలో ఉన్నామని, నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్నామని… మళ్ళీ అందరం కలిసి రాష్ట్రాన్ని బాబు చేసుకుందామని పిలుపు ఇచ్చారు.
తాము రాగానే ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తామని, అదో యూజ్ లెస్ ట్యాక్స్ అని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. దానివల్ల మహా అయితే వంద కోట్ల రూపాయలు కూడా ఆదాయం రాదని, కాకపొతే ఆడిటర్లపై పనిభారం, వేధింపులు ఎక్కువ అయ్యాయని అన్నారు.