రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్ అయ్యారు. విషు రెడ్డి సీఈవో.
అయితే, వేరే ప్రాజెక్టులతో బిజీగా వుండడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి కాస్త పోస్ట్ పోన్ చేసి, ఇటీవలే పట్టాలెక్కించారు.టైటిల్ కోసం పెద్దగా కష్టపడలేదు. శంకర్‌ని పక్కన పెట్టేసి, ఇస్మార్ట్‌కి డబుల్ కనెక్షన్ ఇచ్చేశారు. అలా డబుల్ ఇస్మార్ట్ అని పూరీ ఫ్యాన్స్‌కి క్యాచీగా కనెక్ట్ అయిపోయింది ఈ సినిమా టైటిల్. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ల లిస్టు ఇంకా అనౌన్స్ చేయలేదు పూరీ జగన్నాధ్. అయితే, తాజాగా కేతిక శర్మ పేరు ఈ సినిమా కోసం తెర పైకి వచ్చింది.
ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఆ స్థాయిలో క్రేజ్ వున్న హీరోయిన్లనే ఎంచుకోవాలనుకుంటున్నాడు. అయితే, తాజాగా కేతిక పేరు వినిపిస్తుండడంతో ఆరా తీశారు. కేతిక హీరోయిన్ కాదట. ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతోందట. అలాగే, ఓ మాస్ మసాలా సాంగ్‌ని కేతికతో ప్లాన్ చేయబోతున్నాడట పూరీ జగన్నాధ్.పూరీ జగన్నాధ్ రూపొందించిన రొమాంటిక్ సినిమాతోనే కేతిక హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. అందుకే పూరీ పిలవగానే కాదనలేకపోయిందట.. చూడాలి మరి ఈ గాసిప్‌లో నిజమెంతో.!