Saturday, February 22, 2025
HomeTrending NewsNRI Students: తెలుగు విద్యార్ధులపై సిఎం ఆరా

NRI Students: తెలుగు విద్యార్ధులపై సిఎం ఆరా

ఉన్నత విద్య కోసం అమెరికా  వెళ్లిన విద్యార్థులను వెనక్కి పంపుతున్నట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర మఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై సమాచారం సేకరించాలని, వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎంవో అదికారులను ఆదేశించారు.  వెంటనే  విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో  సంప్రదింపులు జరిపి వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాగా, అమెరికాలోని పలు విమానాశ్రాయాల్లో దిగిన వెంటనే తనిఖీల్లో భాగంగా అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్దులనుంచి పలు వివరాలు సేకరిస్తుంటారు. సరైన సమాధానాలు చెప్పలేకపోయినా, లేదా వారు సమర్పించే పత్రాల్లో ఏవైనా అనుమానాలు కలిగిగా వారిని వెనక్కు పంపుతుంటారు. ఈ ఏడు దాదాపు 2.7 లక్షల మంది ఇండియా నుంచి ఈ ఆగస్ట్-సెప్టెంబర్ సీజన్ లో యూఎస్ కు వెళ్లేందుకు సన్నద్దమయ్యారు. అయితే అక్కడకు చేరుకున్న వారిలో ఒకేసారి 21 మంది విదార్ధులను విమానాశ్రయం నుంచే వెనక్కు పంపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్