పంజాబ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ రాజీనామా చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు ముఖ్య సలహాదారుగా ఉన్న పీకే నిర్ణయం సంచలనంగా మారింది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా రాజీనామా నిర్ణయం చర్చనీయంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలోనే ప్రశాంత కిషోర్ ను ముఖ్య సలహాదారుగా నియమించగా ఆరు నెలలు తిరగక ముందే రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఇంకా నిర్ణయించు కోలేదని పీకే వెల్లడించారు.
దేశంలో అనేక పార్టీలకు ఎన్నికల వ్యుహకర్తగా వ్యవహరించిన ప్రశాంత కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఇమడలేక పోతున్నాడు. గతంలో జనత దళ్ (యు) ఉపాధ్యక్షుడిగా నితీష్ కుమార్ సముచిత స్థానం కల్పించారు. అయినా ఆ పదవి వదులుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పీకే జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా శరద్ పవార్ తో పలు దఫాలు బేటి అయ్యారు.
అయితే కాంగ్రెస్ లో ప్రశాంత కిషోర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇటీవల్ ఢిల్లీ లో హస్తం నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమైన వారి అభిప్రాయాలు తీసుకోక, వ్యూహకర్తల మాటలు వింటే పార్టికి నష్టమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని పీకే లాంటి వాళ్ళ రాజకీయాలు కేవలం గెలుపు కోసమే అనే విధంగా ఉంటాయని, దేశ భవిష్యత్తుకు మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు తారా స్థాయికి చేరుకోవటం వెనుక గత ఎన్నికల్లో పీకే అనుసరించిన విధానాలు కూడా ఓ కారణం అనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు లేనంతగా ఇటీవల పశ్చిమబెంగాల్ లో హిందూ, ముస్లిం అంశాలే ఎన్నికల అజెండాగా మారాయి. మత ప్రాతిపదికన ఎన్నికలు జరగటం ప్రశాంత కిషోర్ వ్యూహమే అని ఎన్నికల అనంతరం విమర్శలు వచ్చాయి. పార్టీలతో ఉచిత పథకాల ప్రకటన దేశాభివృద్దికి నష్టమని తెలిసినా ప్రశాంత్ కిషోర్ వెళ్ళిన ప్రతి చోట ఉచితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దేశ ప్రజల మనోభావాలు, ఉచిత పథకాలతో ఓటర్ల బలహీనతను ఓట్లుగా మార్చటమే పీకే పనిగా పెట్టుకున్నారు.
భారతదేశ పౌరుడిగా దేశ ప్రయోజనాలు ఆలోచించకుండా, కేవలం గెలుపు లక్ష్యంగా సలహాలు ఇస్తూ ఓ ఎన్నికల వ్యాపారిగా ప్రశాంత్ కిషోర్ మారాడనే విమర్శలు ఉన్నాయి.
జాతీయ రాజకీయాల్లో వెనుకబడుతున్న కాంగ్రెస్ ను గెలుపు గుర్రంగా తయారు చేసేందుకు రాహుల్ గాంధి తో జట్టుకట్టిన ప్రశాంత కిషోర్ రాబోయే ఎన్నికల్లో ఏ సెంటిమెంటును తెరమీదకు తీసుకోస్తాడో చూడాలి.