Friday, September 20, 2024
HomeTrending NewsBRS List: బి ఆర్ ఎస్ అభ్యరుల జాబితా విడుదల

BRS List: బి ఆర్ ఎస్ అభ్యరుల జాబితా విడుదల

తెలంగాణలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో  బి ఆర్ ఎస్ అభ్యరులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రెండు మూడు రోజులుగా వస్తున్న ఉహాగానాలు నిజమయ్యాయి. స్వల్ప మార్పులు మినహా దాదాపు సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి రెండు నియోజకవర్గలలో పోటీ చేయనున్నారు.

టికెట్ పోయిన BRS ఎమ్మెల్యేలు

సుభాష్ రెడ్డి – ఉప్పల్

రాజయ్య – స్టేషన్ ఘనపూర్

రాములు నాయక్ – వైరా

రేఖా నాయక్ -ఖానాపూర్

చెన్నమనేని రమేష్ – వేములవాడ

గంప గోవర్ధన్ -కామారెడ్డి

రాథోడ్ బాపురావు -బోధ్

విద్యాసాగర్ రావు – కోరుట్ల ( అభ్యర్థిగా కుమారుడు డాక్టర్ సంజయ్ )

కోరుట్ల ప్రస్తుత ఎమ్మెల్యే కే. విద్యాసాగర్ రావు తనయుడు డా.. సంజయ్ అవకాశం ఇచ్చారు. ఉప్పల్ నుంచి బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డికి చాన్సు దక్కింది. కొన్నాళ్ళుగా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలకు సిఎం పుల్ స్టాప్ పెట్టారు. తాటికొండ రాజయ్య మీద ఓ మహిళా నేతతో సహా తీవ్ర స్థాయి ఆరోపణల నేపథంలో కడియం శ్రీహరికి అవకాశం వచ్చింది. వైరా నుంచి మదన్ లాల్ పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు నిరాశ తప్పలేదు. ఖానాపూర్ నుంచి మంత్రి కేటిఆర్ బాల్య మిత్రుడు భూక్యా జాన్సన్ నాయక్ పోటీ చేస్తారు. ఇక్కడి ఎమ్మెల్యే,  విప్ గా వ్యవహరించిన రేఖ నాయక్ నిరాశే ఎదురైంది.

బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు

కామారెడ్డి- కేసీఆర్
ఉప్పల్ – బండారు లక్ష్మా రెడ్డి
వేములవాడ – చల్మెడ లక్ష్మినరసింహారావు
ఖానాపూర్ – భూక్యా జాన్సన్ నాయక్
స్టేషన్ ఘన్ పూర్ – కడియం శ్రీహరి
ఆసిఫాబాద్ – కోవ లక్ష్మి
వైరా – మదన్ లాల్
బోథ్ – అనిల్ జాదవ్
కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్

నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోశామహల్ సీట్లు పెండింగ్… ఉంచారు. 2, 3 రోజుల్లో ప్రకటిస్తామని కెసిఆర్ వెల్లడించారు. అసమ్మతి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎంతటి వారైనా చర్యలు తీవ్రంగా ఉంటాయని…ఆ తర్వాత వారి ఖర్మ వారు అనుభవిస్తారని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్