Monday, February 24, 2025
Homeసినిమాసంక్రాంతి రేసులో నాగార్జున..?

సంక్రాంతి రేసులో నాగార్జున..?

నాగార్జున ది ఘోస్ట్ మూవీ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. గత కొన్ని రోజులుగా నాగ్ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. దీంతో నాగ్ మూవీ ఎప్పుడు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నారు.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారట. ఈ చిత్రానికి నా సామి రంగా.. అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా బ్లాక్ బస్టర్ సాధించింది. అలాగే సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు కూడా విజయం సాధించింది. అందుకనే ఈసారి కూడా సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించాలని నాగ్ ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు. కొంత మంది దర్శకులను అనుకున్నప్పటికీ ఫైనల్ కొరియోగ్రాఫర్ బిన్నికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మరి.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ నాగ్ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్