భారత యూత్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద చరిత్ర తిరగ రాశాడు. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తరువాత మన దేశం తరఫున చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో అడుగు పెట్టిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫిడే ఆధ్వర్యంలో అజర్ బైజాన్ లోని బాకులో జరుగుతోన్న చెస్ ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ లో నేడు జరిగిన సెమీ ఫైనల్లో వరల్డ్ నంబర్ త్రీ అతగాడు ఫాబియానో కరౌనా ను ట్రై బ్రేకర్ ద్వారా ఓడించి ఫైనల్లో అడుగు పెట్టాడు.
రెండు క్లాసికల్ గేమ్స్ డ్రా గా ముగియడంతో టై బ్రేకర్ కు వెళ్ళాల్సి వచ్చింది తొలి రెండు టై బ్రేకర్ ర్యాపిడ్ రౌండ్లూ కూడా డ్రా అయ్యాయి. మూడో మ్యాచ్ లో 63ఎత్తుల్లో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. నాలుగో మ్యాచ్ లోనూ 82ఎత్తుల తరువాత కరౌనా డ్రా కు అంగీకరించడంతో విజయం ప్రజ్ఞానందను వరించింది.
రేపు మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగబోయే ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్, దిగ్గజ ఆటగాడు, నార్వే కు చెందిన కార్ల్ సన్ తో తలపడనున్నాడు.
2016, 2018, 2022 సంవత్సరాల్లో జరిగిన వివిధ టోర్నమెంట్లలో ప్రజ్ఞానంద కార్ల్ సన్ పై విజయం సాధించి సత్తా చాటాడు. విశ్వనాథన్ 2000, 2002 ల్లో ఫిడే వరల్డ్ కప్ విజేతగా నిలిచాడు. 21 ఏళ్ళ తరువాత ఈ టైటిల్ ను ప్మరజ్రోఞానంద ఇండియాకు తీసుకొస్తాడని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు.