Saturday, March 29, 2025
HomeTrending NewsJNTU: ఆదిలాబాద్‌లో JNTU ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు

JNTU: ఆదిలాబాద్‌లో JNTU ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు

ఆదిలాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ఆఫర్‌ చేయబోయే కోర్సులు, పనిచేసే సిబ్బంది, అవసరమైన బడ్జెట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన ఉత్తర్వులను ప్రత్యేకంగా మరోసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌, హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఈ జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్