Friday, September 20, 2024
HomeసినిమాOn Netflix: నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్న 'బ్రో'

On Netflix: నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్న ‘బ్రో’

పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన, ఎక్కువగా  రీమేక్ సినిమాలకు  ఇంపార్టెన్స్ ఇస్తూ వెళుతున్నారు. ఆల్రెడీ హిట్ సినిమాలనే రీమేక్ చేస్తారు గనుక, కంటెంట్ విషయంలో పెద్దగా టెన్షన్ ఉండదు. అలాగే ఎన్ని రోజులలో షూటింగ్ పూర్తి చేయవచ్చనే విషయంలో ఒక క్లారిటీ ఉంటుంది. ‘వకీల్ సాబ్’ .. ‘ భీమ్లా నాయక్’ సినిమాలు అలా వచ్చినవే. ఆ తరువాత పవన్ చేసిన ‘బ్రో’ సినిమా కూడా ఓ తమిళ మూవీకి రీమేక్ గా వచ్చిందే. పవన్ ఈ సినిమా కోసం ఇచ్చిన డేట్స్ 21 రోజులు మాత్రమే కావడం విశేషం.

ఈ మధ్యనే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. దర్శకుడు సముద్రఖని ఒక కొత్త పాయింటును టచ్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో, పవన్ ను ఆయన అభిమానులు కోరుకున్నట్టుగానే చూపించాడు. నిజానికి ఈ సినిమాలో పవన్ కి హీరోయిన్ ఉండదు. ఆయనకంటూ డ్యూయెట్లు ఉండవు. అయినా ఆ లోటు తెలియకుండా సముద్రఖని ప్లాన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. పవన్ సినిమా నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉండేలా ఆయన జాగ్రత్త పడటం ప్లస్ అయింది.

అలాంటి ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.  పవన్ క్రేజ్ కారణంగా ఇది పెద్ద సినిమా అనిపించినప్పటికీ, కంటెంట్ పరంగా చూస్తే చిన్న సినిమానే. ఇక త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకులు ఊహించుకోవడానికి కారణమైంది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. పారితోషికాలు పక్కన పెడితే, కంటెంట్ పరంగా పెట్టింది తక్కువ ఖర్చునే. తాను చెప్పదలచుకున్న విషయాన్ని సముద్రఖని చెప్పిన విధానం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్