కాంగ్రెస్ పార్టీ మణిపూర్ అల్లర్లను రాజకీయ అవసరాల కోసం వాడుతోందని మణిపూర్ సిఎం బిరెన్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని బీరేన్ సింగ్ విమర్శించారు. రాష్ట్రంలో హింసను సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపించారు. మనుషుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. లడఖ్‌లో ఉంటే లడఖ్ గురించే మాట్లాడాలని హితవుపలికారు.
‘రాహూల్ లడఖ్‌లో ఉన్నప్పుడు మణిపూర్‌లో ఉన్నప్పుడు మణిపూర్ గురించి ఎలా మాట్లాడుతారు. మీరు లడఖ్ వెళ్తే అక్కడి సమస్యల గురిచే మాట్లాడాలి. ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్నవాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణం. మనుషుల జీవితాలతో రాజకీయాలు చేయకూడదు’ అన్నారు. కాగా, రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సలహాలు తీసుకుంటున్నామని వెల్లడించారు.