Saturday, November 23, 2024
HomeTrending NewsYSRCP: దొంగ ఓట్లలో వారిది ఒలింపిక్స్ స్థాయి : విజయసాయి

YSRCP: దొంగ ఓట్లలో వారిది ఒలింపిక్స్ స్థాయి : విజయసాయి

ఓటర్ ఐడి ని ఆధార కార్డు తో అనుసంధానం చేయాలని తమ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి  వెల్లడించారు. అప్పుడే చంద్రబాబు నమోదు చేయించిన దొంగ ఓట్లు తొలగిపోతాయని అన్నారు.  ఆధార లో బయో మెట్రిక్ ఉంటుందని,  వన్ ఓట్ – వన్ సిటిజెన్ ను సమర్ధంగా అమలు చేయవచ్చని, 18 ఏళ్ళు నిండగానే  ఆటోమేటిక్ గా ఓటు హక్కు వస్తుందని, ఎవరైనా మరణిస్తే ఆధార్ చెల్లుబాటు కాదని, వెంటనే ఓటు కూడా పోతుందని, ఎవరైనా అడ్రస్ మారితే ఓటు హక్కు కూడా మారిన నియోజకవర్గంలో చేరుతుందని అన్నారు.  బాబు ఐదేళ్ళ పాలనా కాలంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, అప్పుడే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని కోరామని విజయసాయి వెల్లడించారు.  కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం పార్టీ ఎంపీలు, నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

దొంగ ఓట్ల నమోదులో ఒలింపిక్స్ పోటీలు జరిగితే దానిలో చంద్రబాబు విజేతగా నిలుస్తారని ఎద్దేవా చేశారు.  ఓటర్ల జాబితా ప్రక్రియలో తమ పార్టీ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని, గతంలో చంద్రబాబు హయంలో తయారు చేసిన జాబితాలోనే తప్పులు ఉన్నాయని  వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు సరి చేయాలని, డూప్లికేట్ ఓట్లు  తొలగించాలని, ఫోటో సిమిలర్ ఎంట్రీ తొలగించాలని, మంచి ఓటర్ల జాబితా తయారు చేయాలన్నది తమ పార్టీ సిద్ధాంతమని, ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక దగ్గర మాత్రమే ఉండాలన్నదాన్ని తాము ఆచరిస్తామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయంలో సేవా మిత్ర యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో అక్రమాలు చేసింది చంద్రబాబేనని, ఆ సమయంలో వివరాలు సేకరించేటప్పుడు కులం వివరాలు కూడా అడిగారని విజయసాయి  ఆరోపించారు.

గతంలో తమ పార్టీ ఓట్లు తొలగించారని, దొంగ ఓట్లు నమోదు చేశారని..  ఈ అన్ని అంశాలనూ ఆధారాలతో ఎన్నికల సంఘానికి సమర్పించామన్నారు.  అర్హులైన ప్రతి ఒక్కరికీ, ఇల్లు లేనివారికి, రోడ్డుపై ఉండేవారికి కూడా ఓటు హక్కు కల్పించాలన్న ఎన్నికల సంఘం ఉద్దేశాన్ని నాడు చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేశారో కూడా తెలియజేశామన్నారు. తమ విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్