Monday, November 25, 2024
HomeTrending NewsShooting: నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు

Shooting: నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు

అమెరికాలో  మరోసారి తుపాకి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్‌ కరోలినాలోని చాపెల్‌ హిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఫ్యాకల్టీ మెంబర్‌ (ఫ్రొఫెసర్‌) మృతిచెందాడ. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) వర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడిన దుండగుడు.. సైన్స్‌ భవనంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరెవరీకి గాయాలవలేదని తెలుస్తున్నది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతడేనా లేదా అని తెలియాల్సి ఉంది. అనుమానితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని వర్సిటీ చాన్సలర్‌ కెవిన్‌ గుస్కివీజ్‌ చెప్పారు. క్యాంపస్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వర్సిటీలో కాల్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్