ఈ ఏడాది అధికమాసం కారణంగా తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరపనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి విడుదల చేశారు. సెప్టెంబరు 18న ధ్వజారోహణం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 22న గరుడ వాహన సేవ, 23న స్వర్ణ రథం ఉంటుంది.
నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు జరుగుతాయి. 19న గరుడ సేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణ రథం, 23 చక్రస్నానంతో ముగుస్తాయి.