ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి 20 మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. చెస్టర్ లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ప్రత్యర్థి కివీస్ ను 139 పరుగులకే కట్టడి చేసి, ఈ లక్ష్యాన్ని 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కివీస్ లో గ్లెన్ ఫిలిప్స్-41; ఓపెనర్ ఫిన్ అల్లెన్-21; సోది-17 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వుడ్, బ్రిడాన్ కార్స్ చెరో 3; రషీద్, మోయిన్, లివింగ్ స్టన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ 5 పరుగులకే ఓపెనర్ బెయిర్ స్టో (4) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ విల్ జాక్స్ 12 బంతుల్లో 22 పరుగులు చేసి జట్టు స్కోరు 62 వద్ద వెనుదిరిగాడు. ఈ దశలో డేవిడ్ మలాన్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 రన్స్ చేసి ఔటయ్యాడు. హ్యారీ బ్రూక్-47; లివింగ్ స్టన్-10 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఇంగ్లాండ్ బౌలర్ బ్రిడాన్ కార్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది/