ఆసియా కప్ తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన బంగ్లాదేశ్ రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 89 పరుగులతో విజయం సాధించి బరిలో నిలిచింది. లాహోర్ లోని గడ్డాఫి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. మెహిది హసన్ మిరాజ్ శాంటోలు సెంచరీలతో కదం తొక్కారు. మిరాజ్ 118 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. శాం 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ షకీబ్-32 (నాటౌట్); మొహమ్మద్ నయీమ్-28; ముష్ఫిఖర్ రహీమ్-25 రన్స్ చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆఫ్గన్ ఒక పరుగు వద్ద తొలి వికెట్ (రహమతుల్లా గుర్జాబ్-1) కోల్పోయింది. ఇబ్రహీం జర్దాన్-75; కెప్టెన్ హస్మతుల్లా షాహిది-51; రహ్మత్ షా-33; రషీద్ ఖాన్-24 పరుగులు చేశారు. 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్ అయ్యింది.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్-4; షోరిఫుల్ ఇస్లామ్-3; హసన్ మహ్మూద్, మెహిదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.