Tuesday, November 26, 2024
HomeTrending NewsTTD: రామకోటి తరహాలో గోవింద కోటి: భూమన

TTD: రామకోటి తరహాలో గోవింద కోటి: భూమన

యువతలో హైందవ భక్తి వ్యాప్తి జరిగే కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.  రామకోటి తరహాలో గోవిందకోటి రాసిన వారి కుటుంబసభ్యులకు విఐపి బ్రేక్ దర్శనాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.  10 లక్షల వెయ్యి 116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి ఈ  దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. భూమన అధ్యక్షతన టిటిడి నూతన పాలకమండలి తొలి సమావేశం నేడు జరిగింది.

ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు……
  • ఎల్ కేజి నుంచి పీజీ వరకు చదివే విద్యార్దులకు భగవద్గీత సారాంశం అర్థమయ్యేలా కోటి పుస్తకాలు పంపిణీ చేస్తాం.
  • సెప్టెంబర్ 18వ తేదిన ధ్వజారోహణం సందర్భంగా సీఎం శ్రీ జగన్ గారు పట్టువస్ర్తాలను సమర్పిస్తారు.
  • 2024 సంవత్సరం డైరీలు, క్యాలండర్లను జగన్ గారు ప్రారంభిస్తారు.
  • ముంబయిలోని బాంద్రాలో రూ.5.35 కోట్లతో టీటీడీ సమాచార కేంద్రం…రూ.1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతాం.
  • రూ.2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం చేస్తాం.
  • టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతు పనులకు రూ.49.50కోట్లు కేటాయించాం.
  • టీటీడీ పోటులో 413 పోస్టులు భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేసాం.
  • రూ.2.46 కోట్లతో టీటీడీ ఆసుపత్రులకు మందుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాము.
  • టీటీడీ ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో 47 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నిర్ణయం.
  • వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల వద్ద అభివృద్ది పనులకు రూ.33 కోట్లు కేటాయింపు.
  • తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ది పనులుకు రూ.4.15 కోట్లు కేటాయింపు.
  • తిరుపతిలోని పురాతనమైన 2,3 సత్రాల స్థానంలో రూ.600 కోట్ల వ్యయంతో అచ్యుతం, శ్రీపఠం వసతి సముదాయాలను నిర్మిస్తాం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్