Friday, September 20, 2024
HomeTrending NewsLashkar-e-Taiba: పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ వాంటెడ్ ఉగ్రవాది హతం

Lashkar-e-Taiba: పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ వాంటెడ్ ఉగ్రవాది హతం

భారత్‌లో వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు పాక్ ఆక్రమిత కశ్మీరులో కాల్చిచంపారు. అతడిని రియాజ్‌ అహ్మద్‌ అలియాస్‌ అబు ఖాసింగా గుర్తించారు. అతడు నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నాడని, ఈ ఏడాది జనవరి 1న రాజౌరీ జిల్లాలోని ధంగ్రీలో జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన కుట్రధారి అని అధికారులు తెలిపారు. ఆ దాడిలో ఏడుగురు మృతిచెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో రావల్‌కోట్ ప్రాంతంలోని అల్-ఖుదుస్ మసీదులో గుర్తు తెలియని ముష్కరులు అహ్మద్‌ను కాల్చి చంపారని సమాచారం. జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ 1999లో సరిహద్దుల వెంబడి పరార్ అయ్యాడు. అహ్మద్ ఎక్కువగా మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంప్ నుంచి పనిచేస్తున్నాడు. ఇటీవల రావల్ కోట్‌కు మారాడు. అతను లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జాద్ జాత్‌కు సన్నిహితుడు.

జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ ఉగ్రవాద శిక్షణ కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెళ్ళాడు. రాజౌరీ, పూంచ్ సెక్టార్ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణలో అహ్మద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్