రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అవినీతి, అక్రమాలే లక్ష్యంగా, అడ్డగోలు కార్యక్రమాలతో విచ్చలవిడిగా దోచుకోవడమే పనిగా పాలన సాగించిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని వ్యవస్థలను ఏలా నాశనం చేశాడనేది ఈరోజు అందరికీ కళ్లకు కట్టినట్లు తెలుస్తోందన్నారు,. 2019 ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు చేసిన దుర్మార్గాల్ని, ప్రజలకు చేసిన మోసాల్ని గుర్తించి వెలుగులోకి తీసుకు వస్తోందని చెప్పారు. బాబు హయాంలో చేసిన ఏ పనులు చూసినా అంతులేని అవినీతి, దోపిడీనే కనిపస్తుందని పేర్కొన్నారు, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు.
అమరావతి భూముల అమ్మకాలు, రాజధాని ఇన్నర్ రింగురోడ్ పనులు, తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని పేరుతో బడుగు బలహీనవర్గాల అసైండ్ భూముల్ని బెదిరించి, భయపెట్టి దోచుకోవడం. కేంద్ర నిధులతో నిర్మించిన టిడ్కో గృహాల్లో కూడా విపరీతంగా అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించిందని బొత్స వెల్లడించారు.
బొత్స మాట్లాడిన ఇతర ముఖ్యాంశాలు
- న్యాయం గెలిచింది.. కాబట్టే చంద్రబాబు జైలుకెళ్లాడు…
- నిప్పువి అయితే స్కిల్ స్కామ్ పై సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు?
- అవినీతి చక్రవర్తి చంద్రబాబు పాపం పండింది
- దొరికితే దొంగ.. దొరకకపోతే దొర.. అన్న చందంగా ఇన్నాళ్లుపాటు వ్యవస్థల్ని మేనేజ్ చేసి పబ్బం గడుపుకున్నాడు
- న్యాయమూర్తి తీర్పులపై నిరసనలకు అర్ధమేంటి..?
- ఏసీబీ కోర్టులో చంద్రబాబు గానీ, ఆయన తరఫున న్యాయవాదులు గానీ ఈ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పలేదు
- టీడీపీ రాష్ట్రబంద్‌కు ప్రజామద్ధతు శూన్యం
- ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజకీయ సన్యాసం తీసుకో..
- ఇంకా అనేక కుంభకోణాల్లో చంద్రబాబు దోషిగా నిలబడతాడు
- ప్రజల్ని దోచుకునే నేరగాళ్ళ ముఠాను క్షమించేది లేదు*
- కాలగర్భంలో కలిసిపోయే పార్టీ టీడీపీ
- స్కిల్‌స్కామ్ తో నాకేమీ సంబంధం లేదని బాబు అంటున్నారు
- ఇది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని శాసనసభలో పెడితే ఎమ్మెల్యేలు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంటుందని చెప్పి ఎందుకు తప్పించుకుంటున్నారు?
- ఈ స్కిల్‌స్కామ్‌లో పేద విద్యార్థుల కడుపుకొట్టి రూ.371 కోట్లు చంద్రబాబు దిగమింగాడు.
- టిడ్కో గృహాల నిర్మాణాల పేరిట పేదప్రజల కళ్లల్లో దుమ్ముకొట్టి కొట్టేసిన రూ.118 కోట్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
- రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మాత్రమే మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది
- ప్రజల్ని దోచుకునే నేరగాళ్ల ముఠాను అడ్డుకోవడంలో చురుగ్గా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నాం.