Sunday, September 8, 2024
HomeTrending NewsChandrababu: అక్టోబర్ 5 వరకూ రిమాండ్ పొడిగింపు

Chandrababu: అక్టోబర్ 5 వరకూ రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రిమాండ్ ను అక్టోబర్ 5 వరకూ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 9 న బాబును అరెస్టు చేసిన సమయంలో 22 వరకూ 14 రోజులపాటు రిమాండ్ విధించింది. మొన్న 22న బాబును వర్చువల్ గా జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఆ సమయంలో రిమాండ్ ను రెండ్రోజుల పాటు పొడిగిస్తూ… రెండ్రోజులపాటు ఏపీ సిఐడి పోలీసుల కస్టడీకి అంగీకరించింది.

నిన్న, నేడు చంద్రబాబును సిఐడి అధికారులు  విచారించారు. మొత్తం 14 గంటలపాలు ప్రత్యేక బృందాలు బాబును స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన పరిణామాలపై పలు ప్రశ్నలు సంధించారు. నేటి సాయంత్రం 5 గంటలకు కస్టడీ గడువు ముగియడంతో బాబును మరోసారి హాజరు పరిచారు. విచారణ తీరును, బాబు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న జడ్జి, రిమాండ్ గడువును అక్టోబర్ 5 వరకూ పొడిగించింది. బాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తన వద్ద ఉందని, దానిపై రేపు విచారిస్తామని జడ్జి చెప్పారు.

మరోవైపు బాబు కస్టడీని పొడిగించాలంటూ ఏపీ సిఐడి, ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్