Saturday, November 23, 2024
HomeTrending NewsAP Assembly: జీపీఎస్ కు ఆమోదం

AP Assembly: జీపీఎస్ కు ఆమోదం

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలియజేసింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ఈ బిలును ప్రవేశపెట్టారు. ఇది హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని, కొన్నేళ్లుగా ఉన్న పెన్షన్ స్కీమ్ ను అధ్యయనం చేశామని బుగ్గన చెప్పారు.

  • ప్రభుత్వంలో ఓ ప్రధానమైన భాగం ఉద్యోగులు
  • ఉద్యోగులు పబ్లిక్ సర్వెంట్స్ కోవలోకే వస్తారు.
  • ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోలేదు.
  • గత ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగులకు మరింత లబ్ధి చేకూరుస్తాం
  • గతంలో ఈ హెచ్ ఎస్ లేదు, ఇప్పుడు ఉంది
  • గతంలో 25 శాతం గ్యారెంటీ లేదు, ప్రస్తుతం 50 శాతం గ్యారెంటీగా ఇస్తున్నాం
  • ఇతర రాష్ట్రాలతో పేలిస్తే మనదే మెరుగైన స్కీమ్
  • దాదాపు 53 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం
  • వైద్య ఆరోగ్య శాఖలో 55 వేల పోస్టులు భర్తీ చేశాం
  • 11వ పీఆర్సీ అమలు చేశాం
  • పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 కు పెంచాం
  • గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం
  • చైల్డ్ అడాప్షన్ లీవ్ ను మూడు నెలలు ఇచ్చాం
  • చైల్డ్ కేర్ లీవ్ ను 180 రోజులకు పెంచాము
  • స్పెషల్ కాజువల్ లీవ్స్ 7 రోజులు ఇచ్చాం
  • జీపీఎస్ తో ప్రభుత్వంపై 2,500కోట్ల రూపాయల అదనపు భారం
RELATED ARTICLES

Most Popular

న్యూస్