Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అవినీతి సక్రమం- అరెస్టు అక్రమమా: కాకాణి ప్రశ్న

అవినీతి సక్రమం- అరెస్టు అక్రమమా: కాకాణి ప్రశ్న

స్కిల్‌డెవలప్‌మెంట్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్‌భూములు, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌ల్లో ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. బాబు చేసిన అవినీతిలో ఇప్పటికి బయటకొచ్చింది గోరంతేనని, ఇంకా వెల్లడికావాల్సిన అవినీతి కొండంత ఉందని, అలాంటప్పుడు ఇక్కడ కంచాలు, స్పూన్లు, డోళ్లు మోగించి విజిల్స్‌ వేస్తే ఒనగూరే లాభమేమీ ఉండదన్నారు. నిజంగా, టీడీపీ నేతలకు దమ్మూధైర్యం ఉంటే.. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిభవన్‌, ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాల ముందు నిలబడి… లేదా ఐటీ నోటీసులిచ్చిన రూ.118 కోట్లకు లెక్కలున్నాయంటూ అక్కడ, ఈడీ ఆఫీసుల ముందు మోతమోగిస్తే బాగుంటుందేమో ఆలోచన చేయాలని సూచించారు. నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడారు.

“2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మోగించిన అవినీతి మోత కారణంగానే ఈరోజు ఆయన జైల్లో ఊసలు లెక్కబెట్టుకోవాల్సి వచ్చింది. పాపం.. ఆయన పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే, ఇంట్లో ఈగలమోత.. జైల్లో దోమలమోతగా ఉంది. తప్పుచేసినోళ్లకే ప్రజలంతా సంఘీభావం తెలపాలంటూ ఆయన భార్య, కోడలు కలిసి పళ్లాలు, కంచాలు మోగించాలంటూ ప్రజల్ని సిగ్గులేకుండా కోరడం విడ్డూరంగా ఉంది” అన్నారు.

‘అవినీతి సక్రమం.. అరెస్టు మాత్రం అక్రమం’ అనేది వారి సిద్ధాంతమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎందరో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేశారని,  నిరుద్యోగుల కంచాల్లో మెతుకులు తినేసి వారిని ఆకలితో పస్తులు పెట్టిన నేత చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అలాంటి లంచగొండులకు సంఘీభావంగా ప్రజల్ని కంచాలు మోగించమనడం, ఈలలు, డోళ్లు అంటూ వికృతచేష్టలకు పురిగొల్పడం తగదని నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు కాకాణి హితవు పలికారు.

“దోచుకున్న డబ్బుతో దొంగలా ఆధారాలతో సహా పట్టుబడి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకెళ్లిన తండ్రిని కాపాడాలనే తాపత్రయంలో కొడుకు లోకేశ్‌ ఢిల్లీ వెళ్లాడు. ఆయన నిన్నటిదాకా ఏమని ఉత్తర ప్రగల్భాలు పలికాడో అందరూ చూశారుకదా..? తోలుతీస్తాం. తాటతీస్తాం. ఎర్రబుక్కు.. నిప్పు.. అన్నాడు. తీరా ఆయనొక పప్పు..తుప్పుగా తేలింది. ఢిల్లీ నుంచి ఏపీలో అడుగుపెట్టడానికి గజగజా వణికిపోతున్నాడు. ఎందుకంటే, అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ స్కామ్‌లో లోకేశ్‌ నిందితుడు కదా..? అందుకే, పారిపోయి దాక్కున్నాడు. సీఐడీ అక్కడికెళ్లి నోటీసులిస్తే చచ్చినట్లు రేపు ఏపీకి వస్తున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్