రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు‘. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్. ఈ మూవీ టీజర్, మోషన్ పోస్టర్ సినిమా పై ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్స్ చేస్తుండడంతో జనాల్లోకి బాగానే వెళ్లింది. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు.
ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. అందరి టార్గెట్ పాన్ ఇండియా సక్సెస్. ఈ టైగర్ నాగేశ్వరరావు మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ ను ముంబాయిలో ఏర్పాటు చేశారు. అక్కడ ట్రైలర్ రిలీజ్ తర్వాత మీడియాతో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ ట్రైలర్ లో రవితేజ హిందీ డబ్బింగ్ చూసిన బాలీవుడ్ మీడియా.. ఇంత పెర్ ఫెక్ట్ గా హిందీ ఎలా చెప్పారు అని అడిగారు. అంతే కాకుండా హిందీ ఇంత బాగా వచ్చి కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అని ప్రశ్నించారు.
సరైన కథ కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశానని రవితేజ చెప్పారు. రవితేజ ఈ సినిమా కంటే ముందుగా ఖిలాడి సినిమాను కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేశారు. అయితే.. అంతగా ప్రమోట్ చేయలేదు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు మూవీ కోసం రవితేజ రంగంలోకి దిగారు. ఈ సినిమాని అక్కడ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే.. ఈ లోకల్ స్టోరీ అక్కడ జనాలకు అంతగా నచ్చుతుందా..? ఖిలాడితో పాన్ ఇండియా సక్సెస్ సాధించలేని రవితేజకు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా..? అనే డౌట్ సినీ జనాల్లో స్టార్ట్ అయ్యింది. మరి.. రవితేజ బాలీవుడ్ ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.