Sunday, January 19, 2025
Homeసినిమాఒక్క సినిమా.. ఇద్దరు హీరోయిన్స్ జాతకం మార్చేసిందిగా..!

ఒక్క సినిమా.. ఇద్దరు హీరోయిన్స్ జాతకం మార్చేసిందిగా..!

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టుగా.. ఒక సినిమా ఇద్దరు హీరోయిన్స్ జాతకం మార్చేసింది. ఇంతకీ.. ఆ సినిమా ఏంటి..? ఎవరా హీరోయిన్స్ అనుకుంటున్నారా..? ఆ సినిమా ‘గుంటూరు కారం’. ఆ ఇద్దరు హీరోయిన్స్ పూజా హేగ్డే, మీనాక్షీ చౌదరి. ఇంతకీ విషయం ఏంటంటే.. గుంటూరు కారం సినిమా లో ముందుగా పూజా హేగ్డేను ఫైనల్ చేశారు. మహేష్, పూజా పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే.. ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేయడం.. షూటింగ్ కి బ్రేక్ పడడం జరిగింది. ఈ టైమ్ లో పూజాకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందట.

బాలీవుడ్ సినిమాలో నటించడం కోసమని గుంటూరు కారం నుంచి తప్పుకుంది. పూజా తప్పుకోవడంతో.. ఆ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారు. ఈ అమ్మడు సుశాంత్ నటించిన ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి నటించినా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆశించినట్టుగా అవకాశాలను అందుకోలేకపోయింది.

ఇలాంటి టైమ్ లో మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఎప్పుడైతే మహేష్ బాబు సరసన నటించే అదృష్టం వరించిందో ఈ అమ్మడు జాతకం మారిపోయింది. ఆతర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి సినిమాలో, వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు, రవితేజ ముళ్లపూడి తెరకెక్కించే మూవీలోనూ నటిస్తుంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ మూవీలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. ఇలా వరుస అవకాశాలతో కెరీర్ లో దూసుకెళుతుంది. ఇక పూజా హేగ్డే విషయానికి వస్తే.. ఒక్క బాలీవుడ్ మూవీ తప్పితే చేతిలో మరో సినిమా లేదు. ఈ విధంగా గుంటూరు కారం అనే ఒక్క సినిమా ఇద్దరు హీరోయిన్స్ జాతకాల్ని మార్చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్